ఇవాళ్టి నుంచి టీ20 సిరీస్‌..ఆ ప్లేయ‌ర్ లేకుండానే భార‌త్‌

by velandi.Saikiran |

తిలక్ వర్మ స్థానంలో మూడవ వికెట్ కు ఇషాన్ కిషన్ బరిలోకి దిగబోతున్నాడట.

ఇవాళ్టి నుంచి టీ20 సిరీస్‌..ఆ ప్లేయ‌ర్ లేకుండానే భార‌త్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండియా ( India), న్యూజిలాండ్ ( New Zealand) మధ్య మరో రసవత్తర పోరు ఇవాళ ప్రారంభం కానుంది. ఈ రెండు జట్ల మధ్య ఇవాల్టి నుంచి టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగానే ఇవాళ నాగ్ పూర్ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే నాగ్ పూర్ చేరుకున్న ఇరుజట్లు, ప్రాక్టీస్ లో మునిగితేలాయి. ఇవాళ రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఇండియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ కొనసాగనున్నాడు.

ఇషాన్ కిషన్ కు ఛాన్స్

న్యూజిలాండ్ తో జరగబోయే మొదటి టీ20 మ్యాచ్ కోసం సూర్య కుమార్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిలక్ వర్మ స్థానంలో మూడవ వికెట్ కు ఇషాన్ కిషన్ బరిలోకి దిగబోతున్నాడట. ఈ మేరకు సూర్య ప్రకటన చేశారు. అంటే తిలక్ వర్మ స్థానంలో చివరి క్షణంలో సెలెక్ట్ అయిన శ్రేయాస్ అయ్యర్ కు ఈ మ్యాచ్ లో అవకాశం రాబోదన్నమాట. అతని స్థానంలో ఇషాన్ కిషన్ ఛాన్స్ దక్కించుకున్నాడు. కాగా ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు, ఎలాగైనా టి20 సిరీస్ గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది. అటు ఈ టి20 సిరీస్ గెలిచి ప్రపంచకప్ 2026 టోర్నమెంటులో ఇరగదీయాలని న్యూజిలాండ్ భావిస్తోంది.

Next Story