నమీబియాతో మ్యాచ్.. అభిషేక్ స్థానంలో కొత్త ప్లేయ‌ర్?

by velandi.Saikiran |

అమెరికా పై గెలిచిన భారత జట్టుకు స్టార్ ఆటగాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma ) దూరమయ్యాడు.

నమీబియాతో మ్యాచ్.. అభిషేక్ స్థానంలో కొత్త ప్లేయ‌ర్?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో మరో కీలక మ్యాచ్ కోసం భారత జట్టు సిద్ధమైంది. ఇప్పటికే అమెరికా పై విజయం సాధించిన ఇండియా, ఇప్పుడు మరో పసికూన నమీబియాతో తలపడనుంది. భారత్, నమీబియా జట్ల మధ్య ఇవాళ సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ఉండనుoది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడతాయి. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న రెండు జట్లు, ప్రాక్టీస్ లో నిమగ్నం అయ్యాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇండియాకు ఊహించని షాక్ తగిలింది.

అభిషేక్ శర్మ లేకుండానే భారత్ ?

అమెరికా పై గెలిచిన భారత జట్టుకు స్టార్ ఆటగాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma ) దూరమయ్యాడు. అతనికి తీవ్రమైన కడుపునొప్పి, జ్వరం ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఆస్పత్రిలో అభిషేక్ శర్మ ఉన్నట్లు చెబుతున్నారు. ఇవాళ లేదా రేపు అభిషేక్ శర్మ డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి. అయితే అభిషేక్ శర్మ భారత జట్టుకు దూరమైన నేపథ్యంలో, సంజు శాంసన్ కు బంపర్ ఆఫర్ తగిలింది. అతన్ని ఇవాల్టి మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

సంజు శాంసన్ ఓపెనర్ గానే కాకుండా వికెట్ కీపర్ గా కూడా పనికి వస్తాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్ కావడంతో భారత జట్టుకు మంచి హెల్ప్‌ కానుంది. కానీ అతని ఫామ్ మాత్రం ఇబ్బంది పెడుతోంది. న్యూజిలాండ్ సిరీస్ లో అత్యంత దారుణంగా సంజు శాంస‌న్‌ విఫలమయ్యాడు. అయితే ప‌సికూన‌ నమీబియాపై మాత్రం సంజు రెచ్చిపోతే మంచి అవకాశాలు రానున్నాయి. అటు భార‌త‌ ఫాస్ట్ బౌలర్ బుమ్రాకు ఇవాళ్టి మ్యాచ్ లో కూడా రెస్ట్ ఇస్తార‌ని అంటున్నారు. సిరాజ్‌, అర్ష‌దీప్ నే వాడుకోనున్నారు. పాకిస్తాన్ తో జ‌రిగే మ్యాచ్ లో మాత్రం బుమ్రా ఆడే ఛాన్స్ ఉంది.

Next Story