- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND VS ENG : సిరాజ్, ప్రసిద్ధ్ విజృంభణ.. ఐదో టెస్టులో పుంజుకున్న భారత్
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో రెండో రోజు టీమిండియా పుంజుకుంది.

దిశ, స్పోర్ట్స్ : సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన ఐదో టెస్టులో టీమిండియా పుంజుకుంది. తొలి రోజు బ్యాటుతో మోస్తరు ప్రదర్శననే చేసినప్పటికీ.. రెండో రోజు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన బౌలింగ్‌తో టీమిండియాను పోటీలోకి తెచ్చారు. లండన్‌లోని ది ఓవల్ స్టేడియంలో జరుగుతున్న ఐదో టెస్టు శుక్రవారం ఆసక్తికరంగా మారింది. ముందుగా శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరుతో 204/6తో ఆట కొనసాగించిన టీమిండియా ఆట ఎంతో సేపు సాగలేదు. 224 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ కూడా తడబడింది. సిరాజ్(4/86), ప్రసిద్ధ్ కృష్ణ (4/62) విజృంభించడంతో ఆతిథ్య జట్టు 247 రన్స్‌కే కుప్పకూలింది. అయినప్పటికీ తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టుకు 43 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో రోజే రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(7), సాయి సుదర్శన్(11) మరోసారి నిరాశపరిచారు. యశస్వి జైశ్వాల్(51 బ్యాటింగ్) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఫోర్లు, సిక్సర్లతో ధాటిగా ఆడుతున్న అతను ఇన్నింగ్స్‌ను వేగంగా నడిపించాడు. అతనితోపాటు ఆకాశ్ దీప్(4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ 52 పరుగుల లీడ్‌లో ఉంది.
34 బంతుల్లోనే భారత్ ఆలౌట్..
34 బంతులు..20రన్స్.. 4 వికెట్లు.. రెండో రోజు భారత బ్యాటింగ్ ఇంతే. టీమిండియాను ఆలౌట్ చేయడానికి ఇంగ్లాండ్‌కు గురువారం ఎంతో సమయం పట్టలేదు. ఓవర్‌నైట్ స్కోరు 204/6తో ఆట కొనసాగించిన భారత జట్టు కేవలం 20 పరుగులే జత చేసి చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. తొలి రోజు అసాధారణ ప్రదర్శనతో జట్టును ఆదుకున్న కరుణ్ నాయర్(57) తన ఆటను భారీ ఇన్నింగ్స్‌గా మల్చలేకపోయాడు. జోష్ టంగ్ బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు. ఆ కాసేపటికే సుందర్(26), సిరాజ్(0), ప్రసిద్ధ్(0) కూడా పెవిలియన్ చేరారు. ఈ ముగ్గురి అట్కిన్సనే అవుట్ చేశాడు. 70వ ఓవర్‌లో సిరాజ్, ప్రసిద్ధ్‌లను పెవిలియన్ పంపి భారత్ ఆట ముగించాడు. దీంతో అట్కిన్సన్ ఐదు వికెట్ల ప్రదర్శనను పూర్తి చేశాడు. అట్కిన్సన్‌కుతోడు జోష్ టంగ్ కూడా 3 వికెట్లతో కట్టడి చేయడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగుల మోస్తరు స్కోరే చేసింది.
సిరాజ్, ప్రసిద్ధ్ పేస్‌కు ఇంగ్లాండ్ విలవిల
ఇంగ్లాండ్‌కు దక్కిన ఆరంభం చూస్తే ఆ జట్టు భారీ స్కోరు చేయడం ఖాయమే అనిపించింది. ఆ తరహాలో ఓపెనర్లు జాక్ క్రాలీ, డక్కెట్ చెలరేగారు. క్రాలీ 57 బంతుల్లో 64 రన్స్ చేయగా.. డక్కెట్ 38 బంతుల్లో 43 రన్స్ చేశాడు. అయితే, 13వ ఓవర్‌లో ఆకాశ్ దీప్..డక్కెట్‌ను అవుట్ చేసి భారత్‌కు ఊరటనిచ్చాడు. కాసేపటికే ప్రసిద్ధ్ బౌలింగ్‌లో జాక్ క్రాలీ కూడా వికెట్ కోల్పోయాడు. అనంతరం సిరాజ్ స్వల్ప వ్యవధిలోనే మూడు కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను కోలుకోకుండా దెబ్బకొట్టాడు. ఓలీ పోప్(22), జోరూట్(29),జాకబ్ బెథెల్(6)లను పెవిలియన్ పంపాడు. దీంతో ఇంగ్లాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. మిగతా బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(53) మాత్రమే పోరాటం చేశాడు. మరోవైపు, ప్రసిద్ధ్ లోయర్ ఆర్డర్ భరతం పట్టాడు. వరుసగా జేమీ స్మిత్(8), ఓవర్టన్(0), అట్కిన్సన్(11)లను అవుట్ చేశాడు. ఇక, హ్యారీ బ్రూక్‌ను సిరాజ్ అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ ఆట ముగిసింది. 11వ స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సిన క్రిస్ వోక్స్ గాయం కారణంగా మ్యాచ్ నుంచి తప్పుకోవడంతో అబ్సెంట్ హర్ట్‌గా పరిగణించడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది.






