- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌లో యువ భారత్‌కు ఎదురులేకుండా పోయింది. వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. బులవాయోలో శనివారం జరిగిన చివరి గ్రూపు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో(డీఎల్‌ఎస్ పద్ధతి) గెలుపొందింది. ఈ గెలుపుతో భారత జట్టు గ్రూపు దశను అజేయంగా ముగించింది. వర్షం అంతరాయం కలిగించడంతో తొలి ఇన్నింగ్స్‌ను 37 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్‌ను భారత బౌలర్లు అంబ్రీష్, హెనిల్ పటేల్ బెంబేలెత్తించారు. అంబ్రీష్ 4 వికెట్లు, హెనిల్ 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. దీంతో న్యూజిలాండ్ 36.2 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో కల్లుమ్ సాంస్సన్(37 నాటౌట్) టాప్ స్కోరర్. డీఎల్‌ఎస్ పద్ధతిలో భారత్ లక్ష్యాన్ని 130గా నిర్ణయించారు. ఆ టార్గెట్‌ను యువ భారత్ కేవలం 13.3 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ ఆయుశ్ మాత్రే(53) మెరుపు హాఫ్ సెంచరీ బాదగా.. వైభవ్ సూర్యవంశీ(40) కూడా సత్తాచాటడంతో ఇండియా అలవోకగా గెలిచింది. ఇప్పటికే భారత జట్టు సూపర్-6 రౌండ్‌కు అర్హత సాధించింది. ఈ నెల 27న జింబాబ్వేతో తలపడనుంది.






