చెలరేగిన వైభవ్ సూర్యవంశీ.. యూత్ వన్డే సిరీస్ కైవసం చేసుకున్న భారత అండర్-19 జట్టు

by Harish |

ఆస్ట్రేలియా పర్యటనలో భారత అండర్-19 ప్లేయర్లు అదరగొడుతున్నారు.

చెలరేగిన వైభవ్ సూర్యవంశీ.. యూత్ వన్డే సిరీస్ కైవసం చేసుకున్న భారత అండర్-19 జట్టు
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా పర్యటనలో భారత అండర్-19 ప్లేయర్లు అదరగొడుతున్నారు. ఆతిథ్య జట్టును బెంబేలెత్తిస్తున్న మన యువ క్రికెటర్లు వరుసగా రెండో వన్డేలోనూ నెగ్గి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే యూత్ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్నారు. ఇప్పటికే తొలి వన్డేలో గెలుపొందిన భారత అండర్-19 జట్టు బ్రిస్బేన్ వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డేలోనూ సత్తాచాటింది. 51 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా అండర్-19 టీమ్‌పై భారీ విజయం సాధించింది. ముందుగా భారత్ 49.4 ఓవర్లలో 300 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(70), అభిగ్యాన్ కుండు(71), విహాన్ మల్హోత్రా(70) సంచలన ప్రదర్శన చేశారు. ఇక, చేజింగ్‌లో ఆసిస్ తేలిపోయింది. జైడెన్ డ్రాపర్(107) మాత్రమే పోరాడాడు. దీంతో ఆ జట్టు 47.2 ఓవర్లలో 249 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్ల‌లో ఆయుశ మాత్రే 3 వికెట్లు, కనిష్క్ చౌహాన్ 2 వికెట్లతో సత్తాచాటారు.

వైభవ్ వరల్డ్ రికార్డు

భారత యువ సంచలనం, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన పేరిట మరో రికార్డు నెలకొల్పాడు. రెండో వన్డేలో ఆసిస్‌పై 68 బంతుల్లో 70 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు ఉన్నాయి. దీంతో యూత్ వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా వరల్డ్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ ఘనత అండర్-19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్(38 సిక్సర్లు, 21 మ్యాచ్‌ల్లో) పేరిట ఉండగా.. తాజాగా వైభవ్ కేవలం 10 మ్యాచ్‌ల్లోనూ 41 సిక్స్‌లు కొట్టి ఆ రికార్డును బద్దలుకొట్టాడు.


Next Story