భారత్‌కు రెండు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అథ్లెటిక్స్ ఈవెంట్ల ఆతిథ్యం!

by Ramesh Naini |

అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లకు వేదికగా మారుతున్న భారత్‌కు మరో రెండు అరుదైన అవకాశాలు దక్కాయి.

భారత్‌కు రెండు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అథ్లెటిక్స్ ఈవెంట్ల ఆతిథ్యం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లకు వేదికగా మారుతున్న భారత్‌కు మరో రెండు అరుదైన అవకాశాలు దక్కాయి. 2027 ఆసియా రిలేస్, 2028 ఆసియా ఇండోర్ ఛాంపియన్‌షిప్‌లకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. హాంకాంగ్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ సంఘం (AAA) ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు ప్రతిష్టాత్మక ఈవెంట్లు భారత్‌లో జరగనుండటం ఇదే తొలిసారి. గత ఏడాది అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI) దాఖలు చేసిన బిడ్‌ల ఆధారంగా ఈ ఆతిథ్య హక్కులు దక్కాయి.

2027 ఆసియా రిలేస్

మే నెలలో చండీగఢ్‌ వేదికగా ఈ పోటీలు జరుగుతాయి. ఈ ఛాంపియన్‌షిప్‌లో పురుషులు, మహిళల, మిక్స్‌డ్ విభాగాలలో 4x100 మీటర్లు, 4x400 మీటర్ల రిలే పోటీలు ఉంటాయి. వివిధ ఆసియా దేశాల నుండి దాదాపు 200 మందికి పైగా అథ్లెట్లు ఇందులో పాల్గొననున్నారు.

2028 ఆసియా ఇండోర్ ఛాంపియన్‌షిప్

జనవరి నెలలో భువనేశ్వర్ వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి. విశేషమేమిటంటే, భువనేశ్వర్ 2028 వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్‌షిప్స్‌కు కూడా ఆతిథ్యం ఇవ్వబోతోంది. దేశంలో జరగనున్న మొట్టమొదటి ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఇదే కావడం గమనార్హం. ‘రెండు పెద్ద అంతర్జాతీయ ఈవెంట్‌లకు భారత్‌ ఆతిథ్యమివ్వడం దేశం గర్వించదగ్గ క్షణం.’ వరల్డ్ అథ్లెటిక్స్ ఉపాధ్యక్షుడు అదిల్లె సుమరివాలా అన్నారు.

Next Story