చాంపియన్స్ ట్రోఫీకి నేడు భారత జట్టు ఎంపిక చేసే చాన్స్!

by Harish |

వచ్చే నెలలో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించే అవకాశం ఉంది.

చాంపియన్స్ ట్రోఫీకి నేడు భారత జట్టు ఎంపిక చేసే చాన్స్!
X

దిశ, స్పోర్ట్స్ : వచ్చే నెలలో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించే అవకాశం ఉంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి జట్టును వెల్లడించనున్నట్టు సమాచారం. జట్టు వివరాలతోపాటు ఐసీసీ టోర్నీలో వ్యూహాల గురించి వివరించనున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం సెలెక్షన్ కమిటీ కెప్టెన్ రోహిత్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో వర్చువల్‌గా మాట్లాడినట్టు తెలిసింది. శనివారం సెలెక్షన్ కమిటీ మరోసారి సమావేశమై.. ఆ తర్వాత ముంబైలో అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించడానికి ఐసీసీ పెట్టిన గడువు ఈ నెల 12తో ముగిసింది. అదనపు సమయం కావాలని ఐసీసీని బీసీసీఐ కోరినట్టు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసే జట్టే ఆ టోర్నీకి ముందు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఐసీసీ టోర్నీకి ముందు ఇంగ్లాండ్‌తో పోరు భారత్‌కు సన్నాహకంగా ఉపయోగపడనుంది. ఇటీవల ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.


Next Story