- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ind Vs Nz 2nd Test : భారత్ టార్గెట్ 359 పరుగులు
పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు(2nd Test)లో టీమిండియా(INDIA)కు న్యూజిలాండ్(New Zealand) 359 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది.

దిశ, వెబ్ డెస్క్ : పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు(2nd Test)లో టీమిండియా(INDIA)కు న్యూజిలాండ్(New Zealand) 359 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. 198/5 స్కోర్ తో శనివారం మూడో రోజున రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన కివీస్ 255 పరుగులకు ఆలౌటైంది. టామ్ లేథమ్ (86), గ్లెన్ ఫిలిప్స్ (48*), టామ్ బ్లండెల్ (41) రాణించారు. కివీస్ తొమ్మిది వికెట్లను స్పిన్నర్లే తీయడం గమనార్హం. రూర్కే రనౌట్ అయ్యాడు. భారత బౌలర్లు సుందర్ 4, రవీంద్ర జడేజా 3, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు. స్పిన్ కు అనుకూలంగా మారిన పిచ్ పై భారీ లక్ష్యం ఛేదించడం టీమ్ ఇండియాకు సవాలే.
తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 259 పరుగులు చేయగా.. భారత్ 156 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. టీమిండియా కివీస్ స్పిన్నర్లను ఎదుర్కొని లక్ష్యాన్ని ఛేదిస్తారా లేక వరుసగా రెండో టెస్టులోని ఓడి డబ్ల్యుటీసీ టెస్టు చాంపియన్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటారా చూడాల్సిఉంది. టెస్టు క్రికెట్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో పెద్ద లక్ష్యాన్ని ఛేదించడం బ్యాటర్లకు కాస్త కష్టమేనంటున్నారు నిపుణులు.






