హాంగ్ కాంగ్ చేతిలో ఓడిన భారత్.. ఏఎఫ్‌సీ ఏసియన్ కప్ క్వాలిఫైయింగ్ ఆశలు సంక్లిష్టం

by Phanindra |

హాంగ్ కాంగ్ చేతిలో 1-0 తేడాతో భారత్ ఓడింది. దీంతో ఏఎఫ్‌సీ ఏసియన్ కప్ క్వాలిఫైయింగ్ ఆశలు సంక్లిష్టంగా మారాయి.

హాంగ్ కాంగ్ చేతిలో ఓడిన భారత్.. ఏఎఫ్‌సీ ఏసియన్ కప్ క్వాలిఫైయింగ్ ఆశలు సంక్లిష్టం
X

దిశ, స్పోర్ట్స్: ఏఎఫ్‌సీ ఏసియన్ కప్ క్వాలిఫైయర్స్‌లో భారత్‌కు చేదు అనుభవం ఎదురైంది. 153వ ర్యాంకులో ఉన్న హాంగ్ కాంగ్ చేతిలో 1-0 తేడాతో భారత్ ఓడింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. అయితే పెనాల్టీ టైంలో స్టీఫన్ పెరీరా చేసిన గోల్.. భారత్ ఆశలపై నీళ్లు కుమ్మరించింది. భారత జట్టు తమకు వచ్చిన అవకాశాలను గోల్స్‌గా మలచడంలో పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. టీం ఎటాకింగ్‌లో లోపాలు ఈ మ్యాచ్‌తో మరోసారి బహిర్గతమయ్యాయి. ఈ పరాజయంతో గ్రూప్-సీలో చివరి స్థానానాకి భారత్ పడిపోయింది. దీంతో ఏఎఫ్‌సీ ఏసియన్ కప్‌‌కు అర్హత సాధించే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.


ఈ క్రమంలో భారత్ ఫుట్‌బాల్ టీం హెడ్ కోచ్ మానోలో మార్కెజ్‌పై మరింత ఒత్తిడి పెరిగింది. ఈ మ్యాచులో అతను తీసుకున్న నిర్ణయాలపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత జట్టులో ఎటాకింగ్ లోపాలను గమనించి, రిటైర్‌మెంట్ నుంచి వెనక్కొచ్చిన సునీల్ ఛెత్రిని బెంచ్‌కే పరిమితం చేయడం, అతని స్థానంలో లల్లియాంజులా ఛాంటేను పంపడం.. ఇలా మార్కెజ్‌ వేసిన వ్యూహాలన్నీ బెడిసికొట్టాయి. దీంతో అతన్ని తొలగించి టీంకు కొత్త కోచ్‌ను తీసుకురావాలనే డిమాండ్ కూడా ఊపందుకుంటోంది. కాగా, కొన్ని రోజుల క్రితమే థాయ్‌ల్యాండ్‌తో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచులో భారత్ ఏకంగా 3-0 తేడాతో ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే.

Next Story