ఆసియాకప్‌ ఫైనల్: పాకిస్తాన్‌ చేతిలో భారత్ ఘోర పరాజయం

by Gantepaka Srikanth |

ఆసియాకప్‌ ఫైనల్: పాకిస్తాన్‌ చేతిలో భారత్ ఘోర పరాజయం

ఆసియాకప్‌ ఫైనల్: పాకిస్తాన్‌ చేతిలో భారత్ ఘోర పరాజయం
X

దిశ, వెబ్‌డెస్క్: అత్యంత కీలకమైన అండర్-19 ఆసియాకప్(ACC Mens U19 Asia Cup 2025) ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా క్రీడాకారులు చేతులెత్తేశారు. పాకిస్తాన్‌తో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. సీజన్ మొత్తం అదరగొట్టిన జట్టు.. కీలక ఫైనల్ మ్యాచులో నిరాశపర్చింది. 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 156 పరుగులకే ఆలౌటైంది. దీంతో 191 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. సూర్యవంశీ(26), జార్జ్(16), అభిజ్ఞాన్(13) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. చివర్లో దీపేశ్ దేవేంద్రన్ (16 బంతుల్లో 36) దూకుడుగా ఆడిన ఫలితం లేకుండా పోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. ఓపెనర్ సమీర్ మిన్హాస్ (172) భారీ శతకం చేశాడు. అహ్మద్ హుస్సేన్ (56) హాఫ్‌ సెంచరీ చేశాడు. ఉస్మాన్ ఖాన్ (35), ఫర్హాన్ యూసుఫ్‌ (19), హంజా జహూర్ (18) పరుగులు చేశారు. భారత బౌలర్లలో దీపేశ్‌ దేవేంద్రన్ 3, హెనిల్ పటేల్ 2, ఖిలాన్ పటేల్ 2, కాన్షిక్ చౌహాన్ ఒక వికెట్ తీశారు.

Next Story