- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఎంపిక అప్పుడే : బీసీసీఐ
ప్రస్తుతం టీమిండియా ఆసియా కప్ ఆడుతోంది.

దిశ, స్పోర్ట్స్ : ప్రస్తుతం టీమిండియా ఆసియా కప్ ఆడుతోంది. ఆ టోర్నీ ముగియగానే భారత గడ్డపై వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొంటుంది. అక్టోబర్ 2 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌కు మరో రెండు రోజుల్లో భారత జట్టును ఎంపిక చేస్తామని బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు. ‘వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ఈ నెల 23 లేదా 24 తేదీల్లో భారత జట్టును ఎంపిక చేస్తాం. సెలెక్షన్ మీటింగ్ వర్చువల్‌గా జరుగుతుంది.’అని చెప్పారు. వెస్టిండీస్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 2 నుంచి 6 వరకు తొలి టెస్టు జరగనుండగా.. 10 నుంచి 14 వరకు రెండో టెస్టుకు ఢిల్లీ ఆతిథ్యమివ్వనుంది. తొలి టెస్టుకు ముందు విండీస్ ప్లేయర్లు అహ్మదాబాద్‌లో ఆరు రోజుల క్యాంప్ ఏర్పాటు చేసుకోనున్నారు. ఈ నెల 24 నుంచి 29 వరకు నరేంద్ర మోడీ స్టేడియంలో శిక్షణ పొందుతారు.






