T20I World Cup: టీమిండియా తుది జట్టు ప్రకటనకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

by velandi.Saikiran |

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ టోర్నమెంట్ కోసం భారత జట్టును అతి త్వరలోనే

T20I World Cup: టీమిండియా తుది జట్టు ప్రకటనకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?
X

దిశ‌, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ టోర్నమెంట్ కోసం భారత జట్టును అతి త్వరలోనే ప్రకటించబోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జనవరి మొదటి వారంలో ఈ టోర్నమెంట్ ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించబోతున్నట్లు సమాచారం. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టును ప్రకటించబోతున్నారు. అయితే ఈ భారత జట్టు ప్రకటన నేపథ్యంలో గిల్ వైస్ కెప్టెన్ గా కొనసాగుతాడని అంటున్నారు.

అతన్ని తొలగించే ఛాన్స్ లు లేవని సమాచారం. అటు హర్షిత్ రాణా కూడా ఈ జట్టులో ఉండనున్నాడట. అటు సంజు శాంసన్ సెలెక్ట్ అవుతాడు కానీ, తుది జట్టులో ఉండే అవకాశాలు లేవని సమాచారం. దక్షిణాఫ్రికాపైన ఆడుతున్న భారత ప్లేయర్లే , టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో ఆడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. గ్రూప్ దశలో పాకిస్తాన్ వర్సెస్ భారత జట్ల మధ్య ఫిబ్రవరి 15వ తేదీన మ్యాచ్ కూడా ఉండనుంది.

Next Story