రెడ్, వైట్ బాల్ ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌లు.. కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చిన మాజీ క్రికెటర్

by Harish |

భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చాడు.

రెడ్, వైట్ బాల్ ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌లు.. కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చిన మాజీ క్రికెటర్
X

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చాడు. టీమిండియాకు వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌లు ఉండాలని అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన హర్భజన్.. టీమిండియా స్ప్లిట్ కోచింగ్ ఎంపికను పరిగణించాలన్నాడు. ఆటగాళ్లు, జట్లు వేరుగా ఉన్నందు వల్ల రెడ్ బాల్, వైట్‌బాల్ ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌లు ఉండటం తప్పు కాదన్నాడు. దీనివల్ల కోచ్‌లపై కూడా పనిభారం తగ్గుతుందని చెప్పాడు. ఆటగాళ్లకే కాదు కోచ్‌లకు కూడా సిరీస్‌లకు ముందు సిద్ధం కావడానికి సమయం అవసరమని తెలిపాడు. ఏడాది పొడువునా కోచ్‌కు ఎక్కువ పని ఉండటం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. కోచ్‌కు కూడా కుటుంబం, బాధ్యతలు ఉంటాయని ఏడాది పొడువునా కుటుంబంతో ప్రయాణం చేయడం అంత సులభం కాదన్నాడు. రెడ్ బాల్, వైట్‌బాల్‌ ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌లు ఉండటం మంచిదని చెప్పాడు.


Next Story