IND VS NZ : ఆరేళ్ల తర్వాత న్యూజిలాండ్‌కు వెళ్లబోతున్న టీమిండియా.. షెడ్యూల్ రిలీజ్

by Harish |   (  Updated:2026-06-03 15:00:32  IST  )

IND VS NZ : ఆరేళ్ల తర్వాత న్యూజిలాండ్‌కు వెళ్లబోతున్న టీమిండియా.. షెడ్యూల్ రిలీజ్
X

దిశ, స్పోర్ట్స్ : భారత పురుషుల క్రికెట్ జట్టు అక్టోబర్‌లో న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. కివీస్‌తో మల్టీ ఫార్మాట్ ఆడేందుకు నెలకుపైగా అక్కడే ఉండనుంది. ఈ సుదర్ఘ పర్యటనలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు జరగనుంది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌ షెడ్యూల్‌ను కివీస్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐదు టీ20ల సిరీస్‌తో ఈ టూరు ప్రారంభంకానుంది. అక్టోబర్ 22, 24, 27, 30, నవంబర్ 1 తేదీల్లో టీ20 గేములు జరగనుండగా.. నవంబర్ 4, 7, 10, 13, 15 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక, నవంబర్ 19 నుంచి 23 వరకు తొలి టెస్టు, నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు రెండో టెస్టు జరగనుంది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌కు క్రిస్ట్‌చర్చ్, వెల్లింగ్టన్, అక్లాండ్, హామిల్టన్, తౌరాంగ వేదికలు. ఆరేళ్ల తర్వాత భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. 2019-20‌లో చివరిసారిగా అక్కడ ఆడింది. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్‌కు ముందు ఈ టూరు భారత్‌కు సన్నాహకంగా ఉపయోగపడనుంది.

టీ20 సిరీస్ ఇంగ్లండ్ సొంతం



Next Story