ఇండియా పాక్ సమరం.. తొలి ఓవర్ లో షమీ సరి కొత్త చెత్త రికార్డ్

by Ramesh Goud |   (  Updated:2025-02-23 10:16:53  IST  )

దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్ -పాక్ సమరంలో స్టార్ బౌలర్ షమీ చెత్త రికార్డ్ నమోదు చేశాడు.

ఇండియా పాక్ సమరం.. తొలి ఓవర్ లో షమీ సరి కొత్త  చెత్త రికార్డ్
X

దిశ, వెబ్ డెస్క్: దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్ -పాక్ సమరం (India Pak Match)లో స్టార్ బౌలర్ షమీ(Star Bowler Shami) చెత్త రికార్డ్ నమోదు చేశాడు. చాంపియన్ ట్రోఫీ (Champion Trophy)లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్ (Dubai International Ground) లో భారత్ పాక్ మ్యాచ్ జరుగుతోంది. ఈ హై హీట్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు గత కొద్ది రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇవ్వాళ మ్యాచ్ ఓడితే పాకిస్థాన్ ఇంటి బాట పట్టాల్సిందే. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలైన మ్యాచ్ లో ఇండియా టాస్ ఓడి, బౌలింగ్ కు పరిమితమైంది. పాకిస్థాన్ నుంచి ఓపెనర్లుగా ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజామ్ లు వచ్చారు.

ఇక తొలి ఓవర్ లో భారత్ బౌలర్ మహ్మద్ షమీ (Mahmad Shami) తన పేలవ ప్రదర్శనతో సరి కొత్త చెత్త రికార్డ్ నమోదు చేసుకున్నాడు. తొలి ఓవర్ లో ఏకంగా 11 బాల్స్ వేశాడు. ఓవర్ పూర్తి అయ్యే సమయానికి 5 వైడ్స్ వేసి, ఆరు స్కోర్ ఇచ్చాడు. గతంలో ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్ లు కూడా 11 బంతులే వేసినా.. వాళ్లు తొలి ఓవర్ లో వేయలేదు. దీంతో ఈ రికార్డ్ కాస్త షమీ తన ఖాతాలో వేసుకోవాల్సి వచ్చింది. ఈ ఓవర్ లో 5 వైడ్లు వేసినా ఒక పరుగు మాత్రమే ఇవ్వడం గమనార్హం. మరోసారి 5 వ ఓవర్ వేసిన షమీ మంచి ప్రదర్శన కనబరిచారు. నాలుగో బంతి వేశాక మోకాలి విషయంలో ఇబ్బంది పడ్డ షమీ కాసేపటికి ఓవర్ ను కంటిన్యూ చేశాడు. ఐదవ ఓవర్ లో కేవలం 3 పరుగులు మాత్రమే సమర్పించుకున్నాడు. ప్రస్తుతం ఆట రసవత్తరంగా కొనసాగుతోంది. 13 ఓవర్లు పూర్తయ్యే సమయానికి పాకిస్థాన్ 2 వికెట్ల నష్టానికి 61 పరుగులు మాత్రమే సాధించింది.

Next Story