- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India Open -2025 : క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు
ఇండియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్-750లో పీవీ సింధు దూకుడు కొనసాగుతోంది.

దిశ, స్పోర్ట్స్ : ఇండియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్-750లో పీవీ సింధు దూకుడు కొనసాగుతోంది. సెకండ్ రౌండ్‌లో విజయం సాధించిన సింధు క్వార్టర్ ఫైనల్‌లో అడుగు పెట్టింది. గురువారం న్యూ ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో జపాన్ క్రీడాకారిణి మనామి సుజుపై సింధు 21-15, 21-13 తేడాతో విజయం సాధించింది. 46 నిమిషాలు పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు పూర్తి ఆధిక్యం సాధించింది. క్వార్టర్ ఫైనల్‌లో సింధు ఇండోనేషియాకు చెందిన జార్జియా మరిస్కా టుంజుంగ్‌తో నేడు(శుక్రవారం) తలపడనుంది. ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో సింధు వరుసగా గెలుపొందింది. 2024 అక్టోబర్ తర్వాత సూపర్ 750 టోర్నీ క్వార్టర్ ఫైనల్‌కు తొలి సారిగా అర్హత సాధించింది. రెండు సార్లు ఒలింపిక్ మెడల్ గెలుచుకున్న సింధు గతేడాది నవంబర్‌లో సయ్యద్ మోడీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్-300 టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే.






