నెంబర్ 1 ర్యాంక్ కోల్పోయిన భారత్!

by velandi.Saikiran |

ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయింది భారత్.

నెంబర్ 1 ర్యాంక్ కోల్పోయిన భారత్!
X

దిశ, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన భారత జట్టుకు మరో షాక్ తగిలింది. ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో 1605 రోజుల తర్వాత మొదటి స్థానాన్ని కోల్పోయింది భారత్. ఇండియాపై టీ20 సిరీస్ గెలిచిన ఇంగ్లాండ్ రెండో స్థానం నుంచి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఒక టీ20 సిరీస్ లేదా టోర్నమెంట్ లో ఇండియా మూడు కంటే ఎక్కువ మ్యాచ్ లు ఓడిపోవడం కూడా ఇదే తొలిసారి. మరోవైపు ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ క్యాచ్ అఫీషియెన్సీ 85.2%గా ఉండగా... ఇండియా అది కేవలం 72% మాత్రమే ఉంది. కాగా, ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో ఆస్ట్రేలియా, నాలుగో స్థానంలో న్యూజిలాండ్, ఐదు స్థానంలో దక్షిణాఫ్రికా ఉన్నాయి. ఆరో స్థానంలో పాకిస్థాన్ ఉంది.

Next Story