ఏపీ వాసుల‌కు అల‌ర్ట్..విశాఖలో భూప్రకంపనలు

by velandi.Saikiran |

విశాఖలో ఇవాళ తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి.

ఏపీ వాసుల‌కు అల‌ర్ట్..విశాఖలో భూప్రకంపనలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ వాసులకు బిగ్ అలర్ట్. విశాఖలో ఇవాళ తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. విశాఖలోని మాధవధార, సీతమ్మధార, గాజువాక, పెదవాల్తేరు, ఈస్ట్ పాయింట్ కాలనీలతో పాటు పలు ప్రాంతాలలో భూమి కనిపించింది. దీంతో నిద్రలో ఉన్న జనాలు...భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. లబోదిబోమని మొత్తుకున్నారు. కాలనీవాసులందరూ ఒకే దగ్గరకు చేరి.. భూ ప్రకంపనలపై ఆరా తీశారు. అధికారులకు కూడా సమాచారం అందించారు. రిక్టార్ స్కేల్ పై భూకంపం తీవ్రత 4.5 గా నమోదు అయినట్టు తెలుస్తోంది. అటు విజయనగరం జిల్లాలోనూ పలు చోట్ల భూమి కనిపించినట్లు సమాచారం అందుతోంది. దీంతో అక్కడి ప్రజలకు కూడా అలర్ట్ అయ్యారు.

Next Story