"ఐరన్ లెగ్" అని ట్రోల్స్.. భాగ్య శ్రీ కీలక వ్యాఖ్యలు

by velandi.Saikiran |

భాగ్యశ్రీ.. తనపై వస్తున్న ఐరన్ లెగ్ ట్రోల్స్ పై స్పందించారు.

ఐరన్ లెగ్ అని ట్రోల్స్.. భాగ్య శ్రీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ కొత్త హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఆమె ఎదుగుతున్నారు. పెద్ద హిట్ కోసం ప్రయత్నిస్తున్న భాగ్యశ్రీకి... లెనిన్ ద్వారా మంచి అవకాశం వచ్చింది. ఈ ఒక్క సినిమాతో అఖిల్, ఇటు భాగ్యశ్రీకి మంచి మార్కులు పడ్డాయి. శ్రీ లీల కంటే భాగ్యశ్రీ బోర్సే బెటర్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా వైరల్ అయ్యే స్థాయికి ఆమె ఎదిగారు. అయితే అలాంటి భాగ్యశ్రీ.. తనపై వస్తున్న ఐరన్ లెగ్ ట్రోల్స్ పై స్పందించారు.

యాక్టర్ గా పాత్రకు న్యాయం చేయడమే తన పని అంటూ వ్యాఖ్యానించారు. స్టోరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా స్క్రిప్ట్ లో మార్పులు జరుగుతాయని వివరించారు. తన కంట్రోల్ లో లేని వాటికి ఐరన్ లెగ్ అని ముద్ర వేయడం సరికాదని మండిపడ్డారు. ఇది అందరూ హీరోయిన్లకు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఒకవేళ తాను పాత్రకు న్యాయం చేయనప్పుడు తిట్టినా కూడా పడతానన్నారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కాగా అఖిల్, భాగ్యశ్రీ నటించిన లెనిన్ మొన్న రిలీజ్ అయి మంచి కలెక్షన్స్ రాబడుతోంది.

Next Story