Olympics: సెమీస్‌కు దూసుకెళ్లిన భారత జట్టు

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-04 10:03:43.0  )
Olympics: సెమీస్‌కు దూసుకెళ్లిన భారత జట్టు
X

దిశ, వెబ్‌డెస్క్: పారిస్ ఒలంపిక్స్‌లో భారత హాకీ టీమ్ అద్భుతంగా రాణిస్తోంది. ఆదివారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో బ్రిటన్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు నేరుగా సెమీస్‌కు దూసుకెళ్లింది. బ్రిటన్‌పై షూటౌట్‌లో 4-2 తేడాతో టీమిండియా గెలుపొందింది. కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో 8 రోజుల ఆట ముగిసింది. ఈ క్రమంలో భారత్ 3 పతకాలు సాధించి పతకాల పట్టికలో 50వ స్థానంలో నిలిచింది. క్వార్టర్స్‌లో హాకీ జట్టు సైతం అద్భుతంగా రాణించడంతో క్రీడాకారులతో పాటు అభిమానులకు కూడా పతకంపై ఆశలు చిగురించాయి.

Advertisement

Next Story