ఆసియా కప్ గెలిచేది టీమిండియానే.. శ్రీలంక మాజీ క్రికెటర్ జోస్యం

by Harish |

ఆసియా కప్‌లో టీమిండియానే విజేతగా నిలుస్తుందని శ్రీలంక మాజీ క్రికెటర్ ఫర్వీజ్ మహరూప్ జోస్యం చెప్పాడు.

ఆసియా కప్ గెలిచేది టీమిండియానే.. శ్రీలంక మాజీ క్రికెటర్ జోస్యం
X

దిశ, స్పోర్ట్స్ : త్వరలో జరగబోయే ఆసియా కప్‌లో టీమిండియానే విజేతగా నిలుస్తుందని శ్రీలంక మాజీ క్రికెటర్ ఫర్వీజ్ మహరూప్ జోస్యం చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫర్వీజ్ మహరూప్ మాట్లాడుతూ.. భారత్ స్పష్టమైన ఫేవరెట్‌గా కనిపిస్తుందన్నాడు. భారత జట్టును చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుందన్నాడు. ‘శ్రీలంక, బంగ్లాదేశ్‌ డార్క్ హార్సెస్. ఆ జట్లను తక్కువగా చూడొద్దు. టీ20 క్రికెట్‌లో ఏదైనా జరగొచ్చు.’అని తెలిపాడు. అలాగే, భారత ఫాస్ట్ బౌలింగ్ ఎటాక్ కూడా బాగుందన్నాడు. ‘ఏ పేస్ ఎటాక్ బాగుందని అని చెప్పడం కష్టం. కానీ, భారత్‌లో బుమ్రాతో మంచి సెటప్ ఉంది. పాకిస్తాన్ కూడా అలాగే ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్ సమంగా ఉన్నాయి.’అని ఫర్వీజ్ మహరూఫ్ చెప్పుకొచ్చాడు.


Next Story