అండర్-19 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లోకి భారత్.. శతకొట్టిన ఓపెనర్ ఆరోన్ జార్జ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-04 15:21:36  IST  )

అండర్-19 వన్డే ప్రపంచ కప్ (U19 World Cup) 2026లో భారత్‌ పదోసారి ఫైనల్‌లో అడుగుపెట్టింది.

అండర్-19 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లోకి భారత్.. శతకొట్టిన ఓపెనర్ ఆరోన్ జార్జ్
X

దిశ, వెబ్‌డెస్క్: అండర్-19 వన్డే ప్రపంచ కప్ (U19 World Cup) 2026లో భారత్‌ పదోసారి ఫైనల్‌లో అడుగుపెట్టింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన సెమీస్‌ పోరులో యంగ్ ఇండియా ఏడు వికెట్ల తేడాతో గ్రాంట్ విక్టరీ కొట్టింది. ప్రత్యర్థి జట్టు ఇచ్చిన 311 పరుగుల భారీ టార్గెట్‌ని కుర్రాళ్లు ఊదేశారు. ఓపెనర్ ఆరోన్ జార్జ్ 115 పరుగులతో సెంచరీ కొట్టేశాడు. ఇక వైభవ్ సూర్యవంశీ 68 పరుగులు, కెప్టెన్ ఆయుష్ మాత్రే 62 పరుగులు, విహాన్ మల్హోత్రా 38 పరుగులు చేశారు. దీంతో శుక్రవారం జరబోయే ఫైనల్లో యువ భారత్ జట్టు ఇంగ్లాండ్‌తో తలపడనుంది.

భారీ లక్ష్యాన్ని సెట్ చేసిన ఆఫ్గాన్..

అయితే, అంతకు ముందుకు టాస్ నెగ్గి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఆ జట్టులో ఫైజల్ షినోజాదా 110 పరుగులు చేసిన సెంచరీ సెలబ్రేట్ చేసుకున్నాడు. అనంతరం ఉజైరుల్లా కూడా 101 పరుగులతో కదంతొక్కాడు. ఓపెనర్లు ఉస్మాన్ సాదత్ (39), ఖలీద్ అహ్మద్జాయ్ (31) కూడా జట్టుకు మంచి స్టార్ట్ ఇచ్చారు. భారత బౌలర్లలో కనిష్క్ చౌహాన్, దీపేశ్ దేవేంద్రన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.

Next Story