- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుదీర్మన్ కప్ టోర్నీలో ఆస్ట్రేలియాపై భారత్ గెలుపు..
ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ సుదీర్మన్ కప్ టోర్నీలో ఎట్టకేలకు భారత్ విజయం నమోదు చేసింది.

సుజౌ: ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ సుదీర్మన్ కప్ టోర్నీలో ఎట్టకేలకు భారత్ విజయం నమోదు చేసింది. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి గ్రూపు మ్యాచ్‌లో 4-1 తేడాతో గెలుపొందింది. చైనీస్ తైపీ, మలేసియా చేతిలో వరుసగా రెండు పరాజయాలతో నాకౌట్ అవకాశాలను కోల్పోయిన భారత్ చివరి మ్యాచ్‌లో నెగ్గి విజయంతో టోర్నీని ముగించింది. ఆఖరి గ్రూపు మ్యాచ్‌లోనూ భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో సాయి ప్రతీక్-తనీషా జోడీ 21-17, 14-21, 18-21 తేడాతో కెన్నెత్ ఝే హూయి-గ్రోన్యా సోమర్‌విల్లే చేతిలో పరాజయం పాలైంది. ఆ తర్వాత స్టార్ ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్‌కు విజయబాట పట్టించాడు. మెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో జాక్ యూను 8-21, 8-21 తేడాతో చిత్తు చేశాడు.
ఉమెన్స్ సింగిల్స్‌లో మ్యాచ్‌లో అదే జోరును కొనసాగించిన అనుపమ ఉపాధ్యాయ 21-16, 21-18 తేడాతో టిఫనీ హోపై గెలుపొందింది. అనంతరం మెన్స్ డబుల్స్ మ్యాచ్‌లో అర్జున్-ధ్రువ్ కపిల ద్వయం 21-11, 21-12 తేడాతో రికీ టాంగ్-రేన్ వాంగ్‌ను మట్టికరిపించి భారత్‌కు విజయాన్ని ఖరారు చేసింది. ఇక, చివరి ఉమెన్స్ డబుల్స్ మ్యాచ్‌లో తనీషా క్రాస్టో-అశ్విని పొన్నప్ప 21-19, 21-13 తేడాతో కైట్లిన్-ఏంజెలా జోడీపై నెగ్గింది. ఆఖరి మ్యాచ్‌లో గెలిచినప్పటికీ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడటంతో భారత్ గ్రూపు దశలోనే ఇంటిదారి పట్టింది.
- Tags
- Sudirman Cup






