- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
రింకు సింగ్ మ్యారేజ్‌కు లైన్ క్లియర్.. ఆమెతోనే పెళ్లి.. వివాహం ఎప్పుడంటే?

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ బ్యాటర్ రింకు సింగ్ త్వరలోనే ఓ ఇంటివాడుకాబోతున్నాడు. సమాజ్‌వాది పార్టీ ఎంపీ ప్రియ సరోజ్‌తో రింకు పెళ్లి వార్తలు నిజమయ్యాయి. వీరి వివాహాన్ని ప్రియ తండ్రి, కెరకట్ ఎమ్మెల్యే తుఫాని సరోజ్(సమాజ్‌వాది పార్టీ) ధ్రువీకరించారు. ఈ నెల 26న రింకు, ప్రియ పెళ్లిపై ఇరు కుటుంబాల మధ్య అర్థవంతమైన చర్చలు జరిగాయని, మ్యారేజ్‌కు ఇరు కుటుంబాలు అంగీకరించాయని తెలిపారు. ‘ప్రియ తన స్నేహితుల్లో ఒకరి ద్వారా రింకును కలిసింది. ఏడాదిన్నరగా ఒకరికొకరు తెలుసు. ఇద్దరు ఇష్టపడ్డారు. వారి పెళ్లికి రెండు కుటుంబాలు సమ్మతించాయి.’ అని తెలిపారు. ఇప్పటివరకు రింగ్ సెర్మనీగానీ, ప్రీ వెడ్డింగ్ కార్యక్రమం జరగలేదని చెప్పారు. పార్లమెంట్ సెషన్ తర్వాత ఎంగేజ్‌మెంట్, వివాహ తేదీలను ఖరారు చేస్తామని వెల్లడించారు. అలాగే, వివాహ కార్యక్రమాలు రింకు క్రికెటింగ్ షెడ్యూల్‌పై కూడా ప్రభావం పడకుండా చూసుకోవాల్సి ఉందన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మచ్చల్ షహర్ నుంచి ప్రియ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు, గతేడాది ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన రింకు ఆ తర్వాత టీమ్ ఇండియాలో కీలక ప్లేయర్‌గా మారాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు.