చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ‌..నెద‌ర్లాండ్స్‌పై భార‌త్ విజ‌యం

by velandi.Saikiran |   (  Updated:2026-02-18 17:33:00  IST  )

మోడీ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్ లో నెద‌ర్లాండ్స్ పై 17 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత్.

చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ‌..నెద‌ర్లాండ్స్‌పై భార‌త్ విజ‌యం
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్ లో భారత్ విజయ పరంపర కొనసాగుతోంది. బుధవారం జరిగిన మ్యాచ్ లో భారత జట్టు మరో విక్టరీ కొట్టింది. అహ్మదాబాద్ వేదికగా నెదర్లాండ్స్, భారత్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టిన భారత జట్టు, చివరి క్షణంలో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై ఏకంగా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత జట్టు.

17 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత్

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలిత బ్యాటింగ్ చేసింది భారత జట్టు. ఈ తరుణంలో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. శివం దుబే మెరుపు ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో ఈ స్కోర్ సాధించింది భారత్. అటు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, చివరలో హార్దిక్ పాండ్యా మెరిశారు. దీంతో నెదర్లాండ్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది భారత్. అయితే లక్ష్య ఛేదనలో చివరి వరకు పోరాడిన నెద‌ర్లాండ్స్‌ ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో 20 ఓవర్లు ఆడిన నెదర్లాండ్స్, 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 17 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఇక ఈ నెల 21వ తేదీ నుంచి టీ20 వరల్డ్ కప్ సూప‌ర్ 8 పోరు షురూ కానుంది.

Next Story