- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలుగో టీ20 మనదే.. శ్రీలంకపై 30 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
భారత మహిళా క్రికెట్ జట్టు నాలుగో టీ20లోనూ శ్రీలంకపై ఆధిపత్యం చాటింది.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత మహిళా క్రికెట్ జట్టు నాలుగో టీ20లోనూ శ్రీలంకపై ఆధిపత్యం చాటింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 191 పరుగులకే పరిమితమై, భారత్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పటికే సిరీస్‌ను నెగ్గిన భారత్ 4-0 ఆధిక్యంలో నిలిచింది. టార్గెట్ ఛేదనలో శ్రీలంక ప్లేయర్లు హాసిని పెరీరా (33), చమరి ఆటపట్టు (52) తొలి వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నిర్మించారు. దులాని (29*)తో కలిసి ఆటపట్టు ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించినా ఫలితం దక్కలేదు. భారత బౌలర్లలో అరుంధతి, వైష్ణవి శర్మ తలో రెండు వికెట్లు తీశారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ అద్భుత ఆరంభం అందించారు. తొలి వికెట్‌కు 162 పరుగులు జోడించారు. ఈ మ్యాచ్‌తో స్మృతి మహిళల క్రికెట్‌లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకుంది. షెఫాలీ వరుసగా మూడో హాఫ్ సెంచరీ సాధించింది. రిచా ఘోష్ (40, 16 బంతుల్లో) దూకుడుగా ఆడగా, హర్మన్‌ప్రీత్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. ట్వీట్ లింక్..






