హాకీ ఆసియా కప్‌లో భారత్ జోరు.. 15-0తో కజకస్తాన్‌ చిత్తు

by Phanindra |

హాకీ ఆసియా కప్‌లో భారత్ జోరు కొనసాగిస్తోంది. కజకస్తాన్‌ను ఏఖంగా 15-0తో చిత్తు చేసింది.

హాకీ ఆసియా కప్‌లో భారత్ జోరు.. 15-0తో కజకస్తాన్‌ చిత్తు
X

దిశ, స్పోర్ట్స్: హాకీ ఆసియా కప్ 2025లో భారత జట్టు అదిరే విజయం సాధించింది. పూల్-ఏలో భాగంగా సోమవారం నాడు కజకస్తాన్‌తో తలపడిన టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఇప్పటికే చైనా, జపాన్‌ను ఓడించి సూపర్-4కు అర్హత సాధించిన భారత్.. కజకస్తాన్‌ను ఏకంగా 15-0 తేడాతో చిత్తుగా ఓడించింది. భారత ప్లేయర్లలో అభిషేక్ (5,8,20,59వ నిమిషాల్లో) నాలుగు గోల్స్‌తో మెరిశాడు. సుఖ్‌జీత్ సింగ్ (15,32,38వ నిమిషాల్లో) మూడు గోల్స్, జుగ్రాజ్ సింగ్ (24,31,47వ నిమిషాల్లో) మూడు గోల్స్‌ చేయగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (26వ నిమిషం), అమిత్ రోహిదాస్ (29వ నిమిషం), రాజీందర్ సింగ్ (32వ నిమిషం), సంజయ్ సింగ్ (54వ నిమిషం), దిల్‌ప్రీత్ సింగ్ (55వ నిమిషం) తలో గోల్‌తో రాణించారు. సూపర్ ఫామ్‌లో ఉన్న భారత్‌కు కజకస్తాన్ కనీసం పోటీ ఇవ్వలేకపోవడం గమనార్హం.

Next Story