IND vs ENG: భారత్‌ ఘన విజయం.. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్‌ కైవసం

by Gantepaka Srikanth |

పూణే(Pune)లోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(Maharashtra Cricket Association Stadium) వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది.

IND vs ENG: భారత్‌ ఘన విజయం.. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్‌ కైవసం
X

దిశ, వెబ్‌డెస్క్: పూణే(Pune)లోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(Maharashtra Cricket Association Stadium) వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఎట్టకేలకు భారత్ పైచేయి సాధించింది. దీంతో 03-01తో భారత్ ఆధిక్యంలో ఉంది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌట్‌ అయింది. డకెట్(39), హారీ బ్రూక్(51) తప్ప ఎవరూ రాణించలేదు. ఒకరిద్దరు మినహా మిగిలిన ప్లేయర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. భారత ప్లేయర్లలో అభిషేక్ శర్మ(29), రింకూ సింగ్(30), శివమ్ దూబే(53), హార్దిక్ పాండ్యా(53) రాణించారు. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి టీమిండియా 181 పరగులు చేసింది. దీంతో ఇంకో మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌‌ను భారత్ కైవసం చేసుకున్నది. భారత్‌ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ (3), హర్షిత్‌ రాణా (3), వరుణ్‌ చక్రవర్తి (2), అర్ష్‌దీప్‌(1), అక్షర్‌ పటేల్‌ (1) వికెట్ తీశారు. కంకషన్‌గా వచ్చి మూడు వికెట్లతో భారత్‌ విజయంలో హర్షిత్‌ కీలక పాత్ర పోషించారు.

Next Story