భారత్ ఘన విజయం.. చిత్తుగా ఓడిన పాకిస్తాన్

by Harish |

భారత్ ఘన విజయం.. చిత్తుగా ఓడిన పాకిస్తాన్
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో మరికొద్ది సేపట్లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ గేముకు ముందే ఇండియా క్రికెట్ ఫ్యాన్స్‌ను సంబురాల్లో ముంచెత్తింది భారత మహిళల ‘ఏ’ జట్టు. మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో పాకిస్తాన్ ‘ఏ’పై విజయకేతనం ఎగరవేసింది. బ్యాంకాక్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ ‘ఏ’ టీమ్ భారత బౌలర్ల ధాటికి విలవిలలాడిపోయింది. 18.5 ఓవర్లలో 93 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో షవ్వాల్ జుల్ఫికర్ చేసిన 23 పరుగులకే టాప్ స్కోరంటే పాక్ ఏ విధంగా చేతులెత్తేసిందో అర్థం చేసుకోవచ్చు. మరో ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో సైమా ఠాకూర్, రాధ యాదవ, ప్రేమ రావత్ చెరో 2 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కూల్చేశారు. 94 పరుగుల లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. 10.1 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ విృంద దినేశ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టుకు భారీ విజయాన్ని కట్టబెట్టింది. ఆమె 29 బంతుల్లో 55 రన్స్ చేసి అజేయంగా నిలిచింది. విృంద 12 ఫోర్లు కొట్టడం విశేషం. తొలి మ్యాచ్‌లో యూఏఈ చితులో ఓడిన భారత్.. పాక్‌పై నెగ్గి సెమీస్‌ ఆశలు కాపాడుకుంది. ఈ నెల 17న చివరి గ్రూపు మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్ బెర్త్ దక్కినట్టే.


Next Story