- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత మహిళల క్రికెట్ ‘ఏ’ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బ్యాంకాక్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విక్టరీతో భారత్ సెమీస్‌కు అర్హత సాధించింది. బౌలర్లు విజృంభించడంతో నేపాల్‌పై భారత్ గెలుపు సునాయాసమైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ 18 ఓవర్లలో కేవలం 78 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో ఏ ఒక్కరూ ఆకట్టుకోలేదు. సంజ్హానా ఖడ్కా చేసిన 22 పరుగులే టాప్ స్కోర్. భారత బౌలర్లలో స్పిన్నర్ తనూజ కన్వార్ అదరగొట్టింది. 4 వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించింది. మిన్ను మణి 3 వికెట్లు, కెప్టెన్ రాధ యాదవ్ 2 వికెట్లు తీశారు. 79 పరుగుల లక్ష్యాన్ని ఇండియా 7.5 ఓవర్లలో ఛేదించింది. 3 వికెట్లు కోల్పోయి 82 రన్స్ చేసింది. గత మ్యాచ్‌లో చెలరేగిన వ్రింద దినేశ్ ఈ మ్యాచ్‌లోనూ రాణించింది.18 బంతుల్లో 39 పరుగులతో అజేయంగా నిలిచింది.






