IND (W) Vs SL (W): విజృంభించిన బౌలర్లు.. విజయానికి చేరువలో భారత్

by Kema Shiva Kumar |

ఉమెన్స్ వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా గౌహతి వేదికగా జరుగుతోన్న తొలి మ్యాచ్‌లో శ్రీలంకకు భారత అమ్మాయిలు 270 పరుగుల టార్గెట్ ఇచ్చారు.

IND (W) Vs SL (W): విజృంభించిన బౌలర్లు.. విజయానికి చేరువలో భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా గౌహతి వేదికగా జరుగుతోన్న తొలి మ్యాచ్‌లో శ్రీలంకకు భారత అమ్మాయిలు 270 పరుగుల టార్గెట్ ఇచ్చారు. తొలుత టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కి దిగిన హర్మన్‌ప్రీత్‌ సేన నిర్ణీత 47 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. దీప్తి శర్మ (53), అమన్‌జోత్‌ కౌర్‌ (57) హాఫ్ సెంచరీలు చేశారు. హర్లీన్‌ డియోల్‌ (48), ప్రతికా రావల్‌ (37), స్నేహ్‌ రాణా (28) నాటౌట్‌గా నిలిచి రాణించారు. లంక బౌలర్లలో రణవీర 4, ప్రబోధని 2, చమరి, కులసూర్య ఒక్కో వికెట్‌ తీశారు. అనంతరం బరిలోకి దిగిన లంక ఓపెనర్లు హాసిని పరీరా, చమారి ఆటపట్టు ధాటిగా ఇన్సింగ్స్‌ను ఆరంభించారు.

అయితే, హాసిని పరీరా 20 బంతుల్లో 14 పరుగులు చేసి క్రాంతి గౌడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయింది. అనంతర క్రీజ్‌లోని వచ్చిన హర్షిత్ సమరవిక్రమ చమారితో చక్కని భాగస్వామ్యాన్ని నెలకొల్పుతూ స్కోర్ బోర్డు పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే చమారీ ఆటపట్టు 47 బంతుల్లో 43 పరుగులు చేసి దీప్తీ శర్మ బౌలింగ్ క్లీన్ బౌల్డ్ అయింది. దీంతో క్రీజ్‌లోకి కవిశ దిల్హారి వచ్చింది. అనంతరం ఆచితూచి ఆడుతోన్న హర్షిత్ సమరవిక్రమ శ్రీచరణి బౌలింగ్ ఎల్బీగా వెనుదిరిగింది. భారత బౌలర్ల దెబ్బకు కవిశ దిల్హారి (15), నీలాక్ష డిసిల్వా (35) వెంట వెంటనే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సుగంధిక కుమారి (10) పరుగులు మాత్రమే చేసి స్నేహ్ రాణా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయింది. శ్రీలంక విజయం సాధించాలంటే 60 బంతుల్లో 67 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ మరో మూడు రెండు వికెట్లు పడగొడితే ఉమెన్స్ వరల్డ్ కప్‌లో తొలి విజయాన్ని నమోదు చేస్తుంది.

Next Story