- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND Vs WI: యశస్వీ జైస్వాల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్
ఢిల్లీ (Delhi)లోని అరుణ్ జైట్లీ స్టేడియం (Arun Jaitley Stadium) వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతోన్న రెండో టెస్ట్‌లో భారత జట్టు భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ (Delhi)లోని అరుణ్ జైట్లీ స్టేడియం (Arun Jaitley Stadium) వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతోన్న రెండో టెస్ట్‌లో భారత జట్టు భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. అంతకు ముందు టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్‌గా వచ్చిన యశస్వీ జైస్వాల్ (Yashaswi Jaiswal) సెంచరీతో అదరగొట్టాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనర్లుగా వచ్చిన ఇద్దరూ ధాటిగా ఆడుతుండగా.. రాహుల్ 54 బంతుల్లో 38 పరుగులు చేసి జోమెల్ వారికన్ (Jomel Warrican) బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన సాయి సుదర్శన్ (Sai Sudharshan), ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌తో ధాటిగా ఆడుతున్నాడు. 50 ఓవర్లు ముగిసేసరికి భారత్ 1 వికెట్ కోల్పోయి 196 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ 145 బంతుల్లో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సాయి సుదర్శన్ 92 బంతుల్లో 52 పరుగులు చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వెస్టిండీస్ బౌలర్లలో జోమెల్ వారికన్‌కు ఒక వికెట్ దక్కింది.






