IND Vs WI: 390 పరుగులకు వెస్టిండీస్ ఆలౌట్.. టీమిండియా టార్గెట్ ఇదే

by Kema Shiva Kumar |

ఢిల్లీ (Delhi)లోని అరుణ్ జైట్లీ (Arun Jaitley) స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరగుతోన్న రెండో టెస్ట్ భారత్ గెలుపు వాకిట నిలిచింది.

IND Vs WI: 390 పరుగులకు వెస్టిండీస్ ఆలౌట్.. టీమిండియా టార్గెట్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ (Delhi)లోని అరుణ్ జైట్లీ (Arun Jaitley) స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరగుతోన్న రెండో టెస్ట్ భారత్ గెలుపు వాకిట నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకే కరేబియన్ జట్టు కుప్పకూలింది. ఈ క్రమంలోనే వారు ఫాలోఆన్ ఆడి రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌట్ అయ్యారు. దీంతో టీమిండియాకు 121 పరుగుల టార్గెట్ ఇచ్చారు. విండీస్ బ్యాట్స్‌మెన్లలో కాంప్‌బెల్ (115), షై హోప్ (103) శతకాలు చేశారు. ఇక రోస్టన్ ఛేజ్ (40), జైడెన్ సీల్స్ (32), జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్) రాణించారు. ఇక భారత బౌలర్లలో కుల్‌దీప్‌ యాదవ్ 3, బుమ్రా 3, సిరాజ్ 2, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ పడగొట్టారు.

ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత జట్టు 518/5 వద్ద డిక్లేర్ చేసింది. 121 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్సింగ్స్‌లో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. యశస్వీ జైస్వాల్ (Yashaswi Jaiswal) 7 బంతుల్లో 8 పరుగుల చేసి వారికాన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యారు. ప్రస్తుతం భారత్ 1 వికెట్ కోల్పోయి 13 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 7 బంతుల్లో 5 పరుగులు, సాయి సుదర్శన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. మరో 108 పరుగులు చేస్తే భారత్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయనుంది.

Next Story