- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND Vs SA: ఎట్టకేలకు టాస్ గెలిచిన టీమిండియా.. బౌలింగ్ ఫస్ట్
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతోన్న చివరి వన్డేలో భారత్ జట్టు 20 టాస్‌లు ఓడిన అనంతరం ఇవాళ ఎట్టకేలకు టాస్ నెగ్గింది.

దిశ, వెబ్‌డెస్క్: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతోన్న చివరి వన్డేలో భారత్ జట్టు 20 టాస్‌లు ఓడిన అనంతరం ఇవాళ ఎట్టకేలకు టాస్ నెగ్గింది. ఈ మేరకు కెప్టెన్ కేఎల్ రాహుల్ పర్యాటక జట్టును మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే, సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో టీమిండియలో ఒకే ఒక్క మార్పు చేశారు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో తిలక్ వర్మ తుది జట్టుతో చేరాడు. మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉండగా.. ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్లకు సిరీస్ వశం కానుంది.
ఫార్మాట్లు, వేదికలు, క్యాలెండర్లూ.. కెప్టెన్లు ఎవరైనా టాస్ విషయంలో టీమ్‌ఇండియా (Team India)కు అస్సలు కలిసి రాలేదు. వన్డేల్లో ఇప్పటి వరకు భారత జట్టు వరుసగా 20 సార్లు టాస్‌లు ఓడింది. వన్డే వరల్డ్ కప్-2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో టాస్ గెలిచిన టీమిండియా.. మొన్న రాయ్‌పూర్ వన్డే వరకు టాస్ ఓడింది. కానీ, ఇవాళ వైజాగ్ వేదికగా జరుగుతున్న వన్డేలో టీమిండియా మళ్లీ టాస్ గెలవడంతో జట్టుకు లక్ తిరిగి వచ్చిందని క్రికెట్ లవర్స్ అంటున్నారు.
భారత జట్టు: రోహిత్ శర్మ, జైస్వాల్, కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్ (WK), తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (C), జడేజా, హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణ.
సౌతాఫ్రికా జట్టు: ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్ (WK), టెంబా బావుమా(C), మాథ్యూ బ్రీట్జ్కే, ఐడెన్ మార్క్రామ్, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్.






