- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND vs SA : రెండో టెస్టుకు అలాంటి పిచ్ కావాలని కోరిన గంభీర్
తొలి టెస్టులో సౌతాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : తొలి టెస్టులో సౌతాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ‘ఎవరు తీసుకున్న గోతిలో వారే పడ్డట్టు’ స్పిన్ ఉచ్చులో ఇరుక్కున్న భారత్ గెలవాల్సిన మ్యాచ్‌ను కోల్పోయింది. దీంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నెల 22 నుంచి గువహతి వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా మేనేజ్‌మెంట్ గువహతి, బీసీసీఐ హెడ్ క్యూరేటర్ ఆశిష్ భౌమిక్‌కు తమకు కావాల్సిన పిచ్ గురించి తెలియజేసినట్టు తెలుస్తోంది. పేస్, బౌన్స్ పిచ్ కావాలని క్యూరేటర్‌ను కోరినట్టు తెలిసింది. రెండో టెస్టుకు ఎర్ర నేల ఉపరితలం కలిగిన పిచ్‌ను ఉపయోగించనున్నారు.
తొలి టెస్టులో నల్ల నేల పిచ్ వాడారు. ఎర్ర మట్టి ట్రాక్‌లు స్థిరమైన బౌన్స్‌లు ఇస్తాయి. అలాగే, త్వరగా పగుల్లు రావు. కాబట్టి, తొలి టెస్టు లాగా స్పిన్ ఆరంభ రోజుల్లో కాకుండా ఆట సాగే కొద్ది ప్రభావం చూపుతుంది. సాధారణంగా భారత పిచ్‌లపై మూడో రోజు నుంచి పగుల్లు వచ్చి అస్థిరమైన బౌన్స్ రావడంతో బ్యాటర్లు ఇబ్బందిపడుతుంటారు. తొలి టెస్టులో అలా జరగలేదు. తొలి రోజు నుంచి స్పిన్నర్లు చెలరేగారు. ఇప్పుడు గువహతి అలా జరగొద్దని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తుంది. ‘ఎర్ర మట్టితో పిచ్ తయారు చేయబడింది. పిచ్‌పై అధిక పేస్, బౌన్స్ ఉంటుంది. హోం సీజన్ కంటే ముందే భారత జట్టు తమ డిమాండ్లను తెలియజేసింది. పిచ్ టర్న్ అవుతే బంతి పేస్‌తో టర్న్ అవుతుంది. బౌన్స్ అవుతుంది. అందుకే క్యూరేటర్లు మరి ఎక్కువ అస్థిరమైన బౌన్స్ లేని పిచ్ కోసం ప్రయత్నిస్తున్నారు. ’అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
- Tags
- IND vs SA






