భారత్ ఓటమికి కారణాలు ఇవే... సూర్య, గిల్ ఇక కష్టమేనా?

by velandi.Saikiran |

. నిన్నటి మ్యాచ్ లో కూడా అదే పరిస్థితి. ఈ ఇద్దరు కాస్త క్లిక్ అయి ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్ళం. అటు అభిషేక్ శ‌ర్మ‌

భారత్ ఓటమికి కారణాలు ఇవే... సూర్య, గిల్  ఇక కష్టమేనా?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో భారత జట్టు దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఏకంగా 51 పరుగులు తేడాతో భారత్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి, ముందుగా బౌలింగ్ చేసింది. ఈ తరుణంలో మొదటి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 213 పరుగులు చేసింది. ఇంకా 214 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో భారత్ చేతులెత్తేసింది. తిలక్ వర్మ మినహా మిగిలిన ప్లేయర్లు ఎవరు ఆడలేదు. గిల్ అలాగే సూర్యకుమార్ యాదవ్ మరోసారి అట్టర్ ప్లాప్ అయ్యారు.

మొదటి టీ20లో కూడా ఈ ఇద్దరు రాణించలేదు. నిన్నటి మ్యాచ్ లో కూడా అదే పరిస్థితి. ఈ ఇద్దరు కాస్త క్లిక్ అయి ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్ళం. అటు అభిషేక్ శ‌ర్మ‌ కూడా మరోసారి విఫలం అయ్యాడు. హార్దిక్ పాండ్యా టచ్ లోకి వచ్చి, తొందరగానే ఔట్ అయ్యాడు. అక్షర్‌ పటేల్, శివం దుబే, జితేష్ శర్మ వీరిలో ఎవరు కూడా తిలక్ వర్మకు సపోర్ట్ ఇవ్వలేకపోయారు. దానికి తోడు భారత్ బ్యాటింగ్ ఆర్డర్ ను గౌతమ్ గంభీర్ డిస్టర్బ్ చేయడం మైనస్ అయింది. తిలక్ వర్మకు మూడవ స్థానంలో బ్యాటింగ్ ఇస్తే బాగుండేది. అటు బౌలింగ్ లో కూడా చాలా పరుగులు సమర్పించుకున్నారు. ఈ తప్పిదాల వల్ల భారత్ ఓడిపోవలసి వచ్చింది.

Next Story