IND vs RSA: మొదటి వన్డేలో టాస్ ఓడిన భారత్

by Malleboina Mahesh |

భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ ఈ రోజు ప్రారంభమైంది. ఇందులో భాగంగా మొదటి వన్డే మ్యాచ్ రాంచిలో జరుగుతుండగా.. సౌతాఫ్రికా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

IND vs RSA: మొదటి వన్డేలో టాస్ ఓడిన భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ ఈ రోజు ప్రారంభమైంది. ఇందులో భాగంగా మొదటి వన్డే మ్యాచ్ రాంచిలో జరుగుతుండగా.. సౌతాఫ్రికా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచులో భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చారు. ఈ రోజు వారి ఆటపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చాలా రోజుల తర్వాత కేఎల్ రాహుల్ కు వన్డే కెప్టెన్సీ అవకాశం దక్కడంతో అతనిపై బాధ్యతలు పెరిగాయి. ఇదిలా ఉంటే వన్డే జట్టులో గైక్వాడ్, ప్రసిద్ద్ కృష్ణలకు చోటు దక్కింది.

దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI: ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్(w), ఐడెన్ మార్క్రామ్(c), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రీవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, ప్రెనెలన్ సుబ్రాయెన్, నాండ్రే బర్గర్, ఒట్నీల్ బార్ట్‌మన్

భారత్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, KL రాహుల్(w/c), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ

Next Story