- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెలరేగిన భారత బౌలర్లు.. సౌతాఫ్రికా ఆలౌట్
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడో టీ20లో భారత బౌలర్లు రెచ్చిపోయారు. ధర్మశాల వేదికగా సాయంత్రం 7 గంటలకు ప్రారంభం అయిన ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది.

దిశ, వెబ్ డెస్క్: భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడో టీ20లో భారత బౌలర్లు రెచ్చిపోయారు. ధర్మశాల వేదికగా సాయంత్రం 7 గంటలకు ప్రారంభం అయిన ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా బ్యాటర్లకు ఇండియన్ ఫాస్ట్ బౌలర్లు ఆదిలోనే చుక్కలు చూపించారు. కేవలం 11 పరుగులకే 3 వికెట్లు తీశారు. అనంతరం కెప్టెన్ మార్క్రమ్ ఒంటరి పోరాటం చేయగా.. మిగిలిన బ్యాటర్లు ఎవరూ అంతగా రాణించలేకపోయారు. అనంతరం భారత స్పిన్నర్లు సైతం అద్బుత ఫామ్ కనబరచడంతో సౌతాఫ్రికా జట్టు 20 ఓవర్లకు 117 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ మ్యాచులో ఆర్షదీప్ 2, హర్షిత్ రాణా 2, వరుణ్ చక్రవర్తి 2, కుల్దీప్ యాదవ్ 2, హర్దిక్ పాండ్యా, శివమ్ దుబే చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచులో భారత్ విజయం సాధించాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 118 పరుగులు చేయాల్సి ఉంది.






