- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్.. మళ్లీ టాస్ ఓడిన భారత్
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు రెండో వన్డే రాయ్ పూర్ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచులోను భారత జట్టు టాస్ ఓడిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు రెండో వన్డే రాయ్ పూర్ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచులోను భారత జట్టు టాస్ ఓడిపోయింది. కాగా టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ సిరీస్ లో భాగంగా రాంచీ వేదికగా జరిగిన మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోరు చేసింది. కోహ్లీ సెంచరీ తో రెచ్చిపోయిన విషయం తెలిసిందే. కాగా ఈ మ్యాచులో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్న సౌతాఫ్రికా జట్టు కీలక మార్పులు చేసింది. కెప్టెన్ గా బవుమా బాధ్యతలు తీసుకోగా కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి జట్టులోకి వచ్చారు. భారత్ మాత్రం మొదటి వన్డేలో విజయం సాధించిన జట్టుతోనే రంగంలోకి దిగింది.
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI: క్వింటన్ డి కాక్(w), ఐడెన్ మార్క్‌రామ్, టెంబా బావుమా(సి), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, లుంగి ఎన్గిడి
భారత్ ప్లేయింగ్ XI: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, KL రాహుల్ (w/c), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ






