ఇండియాతో యుద్ధం....పాపం పాకిస్థాన్ క్రికెటర్లకు ఇక చిప్పకూడే ?

by velandi.Saikiran |   (  Updated:2025-05-06 15:55:23  IST  )

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం పర్యాటక క్షేత్రంలో పాకిస్తాన్ ( Pakisthan) ఉగ్రవాదులు చేసిన మారణకాండ కు మోడీ ప్రభుత్వం ప్రతీ

ఇండియాతో యుద్ధం....పాపం పాకిస్థాన్ క్రికెటర్లకు ఇక చిప్పకూడే ?
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం పర్యాటక క్షేత్రంలో పాకిస్తాన్ ( Pakisthan) ఉగ్రవాదులు చేసిన మారణకాండ కు మోడీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ దేశాన్ని ఎడారి చేసేందుకు నీటిని ఆపేసిన మోడీ ప్రభుత్వం... ఆర్థికంగా కూడా ఆ దేశాన్ని దెబ్బతీసేందుకు పన్నాగం పన్నుతోంది. అలాగే పాకిస్తాన్ యూట్యూబర్లకు కూడా ఇప్పటికే షాక్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం.

ఈ దెబ్బకు పాకిస్తాన్ లోని ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కొత్త భయం పట్టుకుంది. ఒకవేళ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే... పాకిస్తాన్ క్రికెటర్ల పరిస్థితి ఏమవుతుందో అనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది. దీనికి కారణం... భారత క్రికెట్ నియంత్రణ మండలి పవర్. ఐసీసీ కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి ముందు తల వంచాల్సిందే.

దీనికి ఉదాహరణే చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 tournament) దుబాయిలో జరగడం. పాకిస్తాన్ దేశంలో జరగాల్సిన టోర్నమెంట్ను... దుబాయ్ కి తనకు వెళ్ళింది ఇండియా. ఇక ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధానికి దిగితే... కచ్చితంగా ఇండియా గెలవడం గ్యారెంటీ. ఆ తర్వాత... పాకిస్తాన్ బోర్డును కూడా చిన్నాభిన్నం చేయవచ్చు. ఐసీసీ చైర్మన్ గా జైషా ఉండనే ఉన్నాడు. బీసీసీఐ కనుసైగ చేస్తే చాలు... ఐసీసీ కూడా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చుక్కలు చూపించడం పక్కా. ఆ దేశంలో... ఒక్క ఐసీసీ టోర్నమెంట్ కూడా జరగకుండా చేయవచ్చు. అలాగే.. ఐసీసీ ( ICC) టోర్నమెంట్ లో.. పాకిస్తాన్ పాల్గొనకుండా ఆంక్షలు కూడా విధించే ఛాన్స్ కూడా ఉంటుంది.

వీటన్నిటిని భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI)సింగిల్ హ్యాండ్ తో చేయగల సత్తా ఉంది. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. ఒకవేళ ఇదే జరిగితే పాకిస్తాన్ క్రికెటర్లు... ఆ దేశాన్ని వదిలి పారిపోవాల్సిందే. దేశం కోసం పాకిస్తాన్ లోనే.. పొట్టకూటి కోసం క్రికెట్ తప్ప ఏదైనా పని చేసుకోవాల్సిందే. ఉగ్రవాదుల భయంతో ఇప్పటికే పాకిస్తాన్ లో పర్యటించేందుకు దేశాలన్నీ భయపడిపోతున్నాయి. అలాంటిది ఒక్కసారి రంగంలోకి భారత క్రికెట్ నియంత్రణ మండలి దిగితే.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డును కాపాడడం కష్టమే అంటున్నారు. ఏదేమైనా ఇండియాతో పెట్టుకుంటే... పాకిస్తాన్ కే నష్టమని చెబుతున్నారు.

Next Story