- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షేక్ హ్యాండ్ వివాదం...పాకిస్థాన్ కు మళ్లీ అవమానం తప్పదా ?
టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య.. ఇవాళ మరో మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య.. ఇవాళ మరో మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సూపర్ ఫోర్ లో భాగంగా ఈ రెండు జట్ల మధ్య ఫైట్ జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో మరోసారి షేక్ హ్యాండ్ వివాదం తెరపైకి వచ్చింది. మొన్న ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ కెప్టెన్ కు టాస్ సమయంలో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు సూర్య కుమార్ యాదవ్. అలాగే మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా సూర్యకుమార్ యాదవ్ అలాగే శివమ్ దుబే ఇద్దరు.. డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి డోర్లు వేసుకున్నారు.
దీనిపై నానా రాద్ధాంతం చేసింది పాకిస్తాన్. అయితే ఈ ఇవాళ జరిగే మ్యాచ్ లో కచ్చితంగా టీమిండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందేనని పాకిస్తాన్ ప్లేయర్లు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఐసీసీ ముందు డిమాండ్ చేస్తున్నాయట. అయితే దీనిపై ఇప్పటి వరకు ఐసీసీ ఎలాంటి రియాక్షన్ కూడా ఇవ్వలేదని సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం మొన్న ఆదివారం చేసిన విధంగానే ఇవాళ కూడా టీమిండియా ప్లేయర్లు చేసే ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది.
అటు పాకిస్తాన్ ప్లేయర్లు కూడా ఇదే అంచనా వేస్తున్నారట. అయితే ఇవాల్టి మ్యాచ్ లో టీమిండియాను ఓడించి... అధికారం తీర్చుకోవాలని పాకిస్తాన్ ప్లేయర్లు కుట్రలు పన్నుతున్నారట. ఎలాగైనా ఇవాళ మ్యాచ్ గెలిచి... ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారట. ఇక పాత రికార్డులు ప్రస్తుత టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ బలాబలాలను చూసుకుంటే.. సూర్య కుమార్ యాదవ్ సేన చాలా బలంగా ఉంది.






