- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IND vs NZ final: టీమిండియాకు టెన్షన్.. గెలిచే ఛాన్స్ ఉందా?
IND vs NZ final: ఫామ్ పరంగా చూస్తే మాత్రం ఈసారి టీమిండియాకు గెలుపు అవకాశాలు ఎక్కువనే చెప్పాలి.

దిశ, వెబ్‌డెస్క్: IND vs NZ final: ఫామ్ పరంగా చూస్తే మాత్రం ఈసారి టీమిండియాకు గెలుపు అవకాశాలు ఎక్కువనే చెప్పాలి. కానీ చరిత్ర చూస్తే మాత్రం భయం పెరుగుతోంది.
భయం భయం.. న్యూజిలాండ్ అంటే ఎందుకో భయం..! ICC టోర్నమెంట్స్‌లో ఆస్ట్రేలియాను కూడా మట్టికరిపించిన ఘనత ఇండియాకు ఉంది కానీ కివీస్‌పై మాత్రం ఆ స్థాయి సీన్ లేదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ పోరుపైనా ఇప్పుడు యావత్ క్రికెట్ ప్రపంచం దృష్టి పడింది. మార్చి 9న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో విజేత ఎవరవుతారన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు అజేయంగా దూసుకుపోతున్న టీమిండియా, కివీస్‌ను లీగ్ దశలో ఓడించినప్పటికీ, ఐసీసీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై మన రికార్డు అంతంత మాత్రమే ఉండడం టెన్షన్ పెడుతోంది.
భారత జట్టు ఐసీసీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై అంతగా ప్రభావం చూపలేకపోవడం సమస్యగానే మారింది. 2021 టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కివీస్ చేతిలో ఓటమిపాలైన కోహ్లీసేన, 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లోనూ అదే జట్టుకి మట్టికరిచింది. మరీ ముఖ్యంగా ఐసీసీ టి20 వరల్డ్ కప్‌లలో భారత్ ఒక్కసారి కూడా న్యూజిలాండ్‌ను ఓడించలేకపోవడం ఒక చేదు నిజమనే చెప్పాలి. అటు ఇదే చాంపియన్స్ ట్రోఫీని 2000 సంవత్సరంలో కివీస్ గెలిచింది. అది కూడా ఇండియాపైనే. న్యూజిలాండ్ ఇప్పుటివరకు ICC టోర్నమెంట్స్‌లో ఆరుసార్లు ఫైనల్‌కు వెళ్లింది. రెండుసార్లు గెలిచింది. ఈ రెండూ కూడా ఇండియాపైనా. ఈ క్రమంలోనే ఈ ఫైనల్ పోరులోనూ అదే సీన్ రిపీట్ అవుతుందేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
అయితే ఫామ్ పరంగా చూస్తే మాత్రం ఈసారి టీమిండియాకు గెలుపు అవకాశాలు ఎక్కువనే చెప్పాలి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌లో మెరుస్తున్నారు. అటు హార్దిక్ పాండ్యా తన ఆల్‌రౌండర్ సత్తా చూపిస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి మిస్టరీ టీమిండియాకు అదనపు బలం. ఇక స్పిన్నర్‌గా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా లాంటి స్పిన్ ఆల్‌రౌండర్ల బలంతో భారత్ రాణిస్తోంది. ఈ ముగ్గురు కలిసి అదరగొడితే న్యూజిలాండ్‌కు దడ పుట్టడం ఖాయం.
మొత్తంగా చూస్తే భారత జట్టు సమష్టిగా రాణిస్తే న్యూజిలాండ్‌పై గెలుపు సాధ్యమే. కానీ గత రికార్డును చూస్తే భారత అభిమానులకు ఆ కివీస్ ఫియర్ అన్నది పోవడంలేదు. ఫైనల్ మ్యాచ్‌లో ప్రతి బంతి, ప్రతి ఓవర్, ప్రతి రన్ కీలకం. 50 ఓవర్ల ఫార్మెట్‌లో టీమిండియా ICC కప్ గెలచి 12ఏళ్లు అవుతుంది. మరి చూడాలి భారత్ మరో ఐసీసీ టైటిల్‌ను చేజిక్కించుకుంటుందా? లేదా కివీస్ మరోసారి మన కలలను అడ్డుకుంటారా? అన్నది మార్చి 9న తేలనుంది!






