- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిలక్ వర్మకు శస్త్రచికిత్స..శ్రేయాస్ అయ్యర్ కు బంపర్ ఆఫర్ ?
తిలక్ వర్మకు శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో శ్రేయాస్ అయ్యర్ కు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. న్యూజిలాండ్ తో జరిగే టి20లతో పాటు ఫిబ్రవరిలో జరిగే ప్రపంచ కప్ టోర్నమెంట్ కు శ్రేయాస్ అయ్యర్ ను తీసుకుంటే బాగుంటుందని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: టి20 ప్రపంచ కప్ కంటే ముందు భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. తిలక్ వర్మ కు శస్త్రచికిత్స అయినట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ హజారే టోర్నమెంట్ ఆడుతున్న నేపథ్యంలో తీవ్రమైన కడుపు నొప్పితో తిలక్ వర్మ ఆసుపత్రిలో చేరాడు. ఈ సందర్భంగా అతనికి చిన్నపాటి శస్త్రచికిత్స చేసినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక ఈ శస్త్రచికిత్స చేయించుకున్న తిలక్ వర్మ, కోలుకోవడానికి రెండు నుంచి నాలుగు వారాల సమయం పడుతుందని చెబుతున్నారు. అంటే నెల రోజులు బెడ్ రెస్ట్ అతనికి అవసరం. ఈ లెక్కన చూస్తే న్యూజిలాండ్ తో జరిగే టి20లతో పాటు, టి20 ప్రపంచ కప్ 2026కు తిలక్ వర్మ దూరం అవుతాడని తెలుస్తోంది. దీంతో తిలక్ వర్మ స్థానంలో ఎవరిని తీసుకుంటారనే దాని పైన కూడా ఇప్పటి నుంచే చర్చ మొదలైంది.
శ్రేయాస్ అయ్యర్ కు ఛాన్స్ ఇవ్వనున్న బీసీసీఐ?
తిలక్ వర్మకు శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో శ్రేయాస్ అయ్యర్ కు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. న్యూజిలాండ్ తో జరిగే టి20లతో పాటు ఫిబ్రవరిలో జరిగే ప్రపంచ కప్ టోర్నమెంట్ కు శ్రేయాస్ అయ్యర్ ను తీసుకుంటే బాగుంటుందని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై రెండు రోజుల్లో ప్రకటన వెలువడే ఛాన్సులు ఉన్నాయి. ఒకవేళ శ్రేయాస్ అయ్యర్ ను కాదనుకుంటే గిల్ లేదా పంత్ కు ఛాన్స్ ఇస్తారని కూడా కొంతమంది చెబుతున్నారు.






