IND Vs NAM: భారీ స్కోర్ చేసిన టీమిండియా.. నమీబియా టార్గెట్ 210

by Kema Shiva Kumar |

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ICC పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 గ్రూప్-A మ్యాచ్‌లో నమీబియాపై భారత జట్టు భారీ స్కోరు సాధించింది.

IND Vs NAM: భారీ స్కోర్ చేసిన టీమిండియా.. నమీబియా టార్గెట్ 210
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ICC పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 గ్రూప్-A మ్యాచ్‌లో నమీబియాపై భారత జట్టు భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచిన నమీబియా మొదట బౌలింగ్ ఎంచుకోగా.. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్ కిషన్ కేవలం 24 బంతుల్లోనే 61 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు.

ఇక మీడిలార్డర్‌లో హార్దిక్ పాండ్యా తనదైన స్టైల్ హిట్టింగ్‌తో 27 బంతుల్లో 52 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పాండ్యాకు దూబే కూడా 23 పరుగులతో కీలక సహకారం అందించాడు. 18 ఓవర్ల ముగిసే సమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 199తో చాలా బలంగా కనిపించింది. ఓ దశలో భారత్ 230 నుంచి 240 పరుగులు చేసేలా కనిపించినా.. నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ అద్భుతమైన బౌలింగ్‌తో కట్టడి చేశాడు. అతడు ఏకంగా 20 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి భారత టెయిలెండర్లను వెంటవెంటనే పెవీలియన్ పెంపాడు. చివరి 5 ఓవర్లలో భారత్ 5 వికెట్లు కోల్పోయి కేవలం 41 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Next Story