- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND Vs NAM: నమీబియాపై భారత్ గ్రాండ్ విక్టరీ.. సత్తా చాటిన కిషన్, చక్రవర్తి
టీ20 ప్రపంచకప్-2026 భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన గ్రూప్-A పోరులో టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్-2026 భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన గ్రూప్-A పోరులో టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది. పసికూన నమీబియాపై భారత్ 93 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి పాయింట్స్ టేబుల్ అగ్రస్థానంలో నిలిచింది. 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసి 2 కీలక వికెట్లు తీసిన హార్దిక్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
మెరుపు ఆరంభం..
అంతకు మందుకు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్ ఇషాన్ కిషన్ కళ్లుచెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కిషన్ (61 పరుగులు, 24 బంతుల్లో), స్టేడియం నలుమూలల బౌండరీల వర్షం కురిపించాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా (52) అర్ధశతకంతో రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. నమీబియా బౌలర్లలో కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ 4 వికెట్ల అద్భుత స్పెల్‌తో భారత్‌ను మరిన్ని పరుగులు చేయకుండా కట్టడి చేశాడు.
కుప్పకూలిన నమీబియా బ్యాటింగ్..
210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా జట్టు భారత బౌలర్ల ధాటికి 116 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో ఓపెనర్లు లారెన్ స్టీన్‌క్యాంప్ 29, జాన్ ఫ్రైలింక్ 22 మాత్రమే చెప్పుకోదగిన స్కోర్ చేశారు. భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన మాయాజాలంతో 3 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు వెన్ను విరిచాడు. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా 2 వికెట్లతో రాణించగా.. బుమ్రా, శివమ్ దూమ్ చెరో వికెట్, పేసర్ అర్షదీప్ సింగ్ టీ20ల్లో తన 250వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో నమీబియా జట్టు 17.4 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది.






