IND Vs ENG: లార్డ్స్‌లో చరిత్ర సృష్టిస్తారా.. మిడిలార్డర్‌పైనే ఆశలు!

by Kema Shiva Kumar |

ఇంగ్లాండ్‌ (England)తో లార్డ్స్ (Lords) వేదికగా జరుగుతోన్న మూడో టెస్ట్ రసవత్తరంగా మారింది.

IND Vs ENG: లార్డ్స్‌లో చరిత్ర సృష్టిస్తారా.. మిడిలార్డర్‌పైనే ఆశలు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్‌ (England)తో లార్డ్స్ (Lords) వేదికగా జరుగుతోన్న మూడో టెస్ట్ రసవత్తరంగా మారింది. ఓ వైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌‌లో పైచేయి సాధించాలని టీమిండియా (Team India) చూస్తుంటే.. మరోవైపు ఆతిథ్య ఇంగ్లీష్ జట్టు శక్తికి మేర పోరాడి పర్యటక జట్టును ఆలౌట్ చేయాలని చూస్తోంది. 193 పరుగుల విజయ లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 కీలక వికెట్లను కోల్పోయి 58 పరుగులు చేసింది. చేతిలో మరో 6 వికెట్లు మిగిలి ఉండగా 135 పరుగులు చేస్తే టీమిండియా చారిత్రక విజయాన్ని నమోదు చేయనుంది.

కానీ, లార్డ్స్ పిచ్ బౌలర్లకు పూర్తిగా అనుకూలిస్తుండటంతో బ్యాటింగ్ చేయడం భారత బ్యాట్స్‌మెన్లకు ఓ సవాలుగా మారింది. ఈ క్రమంలోనే స్వల్ప టార్గెట్‌ను ఛేదించి టీమిండియా విజయం సాధించడం సాధ్యమేనా అన్న సందేహాలు అందరిలోనూ మెదలుతున్నాయి. ఇప్పటి వరకు లార్డ్స్‌ గ్రౌండ్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 344 పరుగులు చేజ్ చేశారు. 1984లో వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్ జట్టుపై ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. అదేవిధంగా ఇంగ్లండ్ జట్టు 2004లో న్యూజిలాండ్ జట్టుపై 282 పరుగులను ఛేదించింది. ఇక జూన్ 2025లో దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాపై 282 పరుగులు చేజ్ చేసి విజయకేతనం ఎగురవేసింది.

Next Story