IND Vs ENG: భారీ స్కోర్ దిశగా ఇంగ్లాండ్.. రసవత్తరంగా ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-04 15:46:57  IST  )

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎడ్జ్‌బాస్టన్ (Edgbaston) వేదికగా జరుగుతోన్న రెండో టెస్ట్‌ డ్రా దిశగా పయనిస్తోంది.

IND Vs ENG: భారీ స్కోర్ దిశగా ఇంగ్లాండ్.. రసవత్తరంగా ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎడ్జ్‌బాస్టన్ (Edgbaston) వేదికగా జరుగుతోన్న రెండో టెస్ట్‌ డ్రా దిశగా పయనిస్తోంది. 77 పరుగులు 3 వికెట్ల ఓవర్‌నైట్ స్కో్ర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు టీ విరామ సమయానికి కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 387 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లు జామీ స్మిత్ 182 బంతుల్లో 162 (నాటౌట్), హ్యరీ బ్రూక్ 234 బంతుల్లో 158 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ ఇద్దరి ముందు భారత బౌలర్లు తేరిపోయారు. ముఖ్యంగా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్‌లను లక్ష్యంగా చేసుకుని స్మిత్, బ్రూక్‌లు రెచ్చిపోయారు. 32వ ఓవర్ వేసిన ప్రసిద్ధ్ ఏకంగా 23 రన్స్ ఇవ్వడంతో చెత్త రికార్డును నమోదు చేశాడు. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో వరస్ట్ బౌలింగ్ ఎకానమీ కలిగిన బౌలర్ల లిస్ట్‌లో ప్రథమ స్థానంలో నిలిచాడు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ 3, మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీశారు.

కాగా, అంతకు ముందు 310/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా (Team India) తొలి ఇన్నింగ్స్ 587 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. శుభ్‌మన్ గిల్ 269 రికార్డ్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 89, యశస్వి జైస్వాల్ 87, వాషింగ్టన్ సుందర్ 42 పరుగులు సాధించారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3 వికెట్లు, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ రెండేసి వికెట్లను నేలకూల్చారు. అదేవిధంగా బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్‌లకు ఒక్కో వికెట్ తీశారు.

Next Story