పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లాండ్.. టీ బ్రేక్ సమయానికి స్కోర్ ఎంతంటే

by velandi.Saikiran |

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో.. ఇంగ్లాండ్ మొదట పై

పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లాండ్.. టీ బ్రేక్ సమయానికి స్కోర్ ఎంతంటే
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో.. ఇంగ్లాండ్ మొదట పై చేయి సాధించగా.. ఇప్పుడు టీమిండియా దుమ్ము లేపుతోంది. మొదటి ఇన్నింగ్స్ లో... మొదట బాగానే ఆడిన ఇంగ్లాండు.. రెండో రోజు టీ బ్రేక్ సమయానికి 7 వికెట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే 42.2 ఓవర్లలో... కేవలం 215 పరుగులు మాత్రమే చేసింది. మహమ్మద్ సిరాజ్ దెబ్బకు... టాప్ వికెట్లను మొత్తం కోల్పోయింది టీమిండియా. ఈ మ్యాచ్ లో మూడు వికెట్స్ తీసాడు సిరాజ్.

ఇక అటు ప్రసిద్ కృష్ణ కూడా రెచ్చిపోయి వికెట్లు తీస్తున్నాడు. అతను ఇప్పటికే మూడు వికెట్లు తీసుకున్నాడు. ఆకాష్ ఒక వికెట్ తో రాణించాడు. ఇక టీమిండియా కంటే మరో 9 పరుగులు వెనుకబడి ఉంది ఇంగ్లాండ్. బంతి పూర్తిగా బౌలర్లకు అనుకూలిస్తున్న నేపథ్యంలో.... టీ బ్రేక్ తర్వాత ఇంగ్లాండ్ ఆల్ అవుట్ అయ్యే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఆటో మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 224 పరుగులకు ఆల్ అవుట్ అయిన సంగతి తెలిసిందే.

Next Story