- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
6 వికెట్లతో చెలరేగిన ఆకాశ్ దీప్.. రెండో టెస్టు టీమిండియాదే
తొలి టెస్టులో పరాజయం పాలైన టీమిండియా అద్భుతంగా పుంజుకుంది.

X
దిశ, స్పోర్ట్స్ : తొలి టెస్టులో పరాజయం పాలైన టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. రెండో టెస్టును ఏకపక్షంగా గెలిచింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బస్టన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై 336 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఎడ్జ్‌బస్టన్‌లో టీమిండియాకు ఇదే తొలి విజయం. టీమిండియా నిర్దేశించిన 608 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 271 పరుగులకే కుప్పకూలింది. యువ పేసర్ ఆకాశ్ దీప్ 6 వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి పతనాన్నిశాసించాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్, బ్యాటర్ జేమీ స్మిత్(88) మాత్రమే ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వారు నిరాశపర్చడంతో ఇంగ్లాండ్ భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ గెలిచిన విషయం తెలిసిందే.
Next Story






