IND Vs ENG: ఆచితూచి ఆడుతోన్న ఇంగ్లాండ్.. 30 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ ఇదే!

by Kema Shiva Kumar |

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్ (Nagpur) వేదికగా జరుగుతోన్న తొలి వన్డేలో టీమిండియా (Team India) టాస్ ఓడింది.

IND Vs ENG: ఆచితూచి ఆడుతోన్న ఇంగ్లాండ్.. 30 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్ (Nagpur) వేదికగా జరుగుతోన్న తొలి వన్డేలో టీమిండియా (Team India) టాస్ ఓడింది. ఇంగ్లాండ్ (England) జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలోనే క్రీజ్‌లోకి వచ్చిన ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (Philip Salt) (43), బెన్ డకెట్ (Ben Duckett) (32) పరుగులు చేసిన చక్కని ఆరంభాన్ని ఇచ్చారు. అయితే, దూకుడుగా ఆడుతున్న సాల్ట్ రనౌట్ అయ్యాడు. మరోవైపు బెన్ డకెట్ హర్షిత్ రాణా (Harish Rana) బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు.

అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన జో రూట్ (19) పరుగుల చేసిన రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇంగ్లీష్ జట్టు బ్యాటింగ్ సెన్సేషన్ హ్యారీ బ్రూక్ హర్షిత్ రాణా (Harishith Rana) బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. దీంతో కెప్టెన్ జోస్ బట్లర్ (Jos Buttler) 54 బంతుల్లో 47 పరుగులు, జాకబ్ బెతెల్ (Jacob Bethel) 35 బంతుల్లో 18 పరుగులతో కలిసి నెమ్మదిగా ఆడుతూ.. భాగస్వామ్యాన్ని నెలకొల్పుతున్నాడు. ఇక భారత బౌలర్లలో హర్షిత్ రాణా 2 వికెట్లు, రవీంద్ర జడేజా 1 వికెట్ పడగొట్టారు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు కట్టుదిట్టంగా ఫీల్డింగ్ చేస్తున్నారు. మైదానం చిరుతల్లా కదులుతుండగా.. రన్ తీయాలంటేనే ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లు ఆలోచిస్తున్నారు. 28 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ 4 కీలక వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది.

Next Story